Rain in Himachal | హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి.. ఉప్పొంగిన నదులు.. లోతట్టు ప్రాంతాల్లో వరదల బీభత్సం
Rain in Himachal | హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల నివాసాలు నీట మునిగాయి. కులూ, మండి మధ్య పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో 3వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పండోహ్ ఏరియాలో నివాసాలు నీట మునగడంతో ఆ నివాసాల్లో చిక్కుకున్న వారిని SDRF (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బలగాలు రక్షించాయి. పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో కల్కా-షిమ్లా రైల్వే మార్గంలోని కోటి, సన్వారా రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
కులూ బస్టాండ్ సమీపంలో ఓ కాలువ ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. కాలువ సమీపంలోని ఇండ్లు కొట్టుకుపోయాయి. రహదారి వెంబడి ఉన్న ఏటీఎం సెంటర్, దుకాణ సముదాయాలను కూడా ప్రవాహం తుడిచిపెట్టేసింది. పలుచోట్ల ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ వర్షాలు, వరదలవల్ల రూ.362 కోట్ల నష్టం వాటిల్లినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ కేంద్రం ఏడు జిల్లాలకు రెడ్ అలార్ట్ ప్రకటించింది.
#WATCH | Beas River in spate amid continuous heavy rainfall in Mandi and Kullu of Himachal Pradesh
Traffic movement is restricted on National Highway 3 from Mandi towards Kullu due to landslides pic.twitter.com/WGHoHfVbiN
— ANI (@ANI) July 9, 2023
#WATCH | Railway track closed between Koti and Sanwara railway stations at Tunnel No. 10 due to heavy rainfall on the Kalka-Shimla railway route in Himachal Pradesh pic.twitter.com/Yy6vBOcoKp
— ANI (@ANI) July 9, 2023
#WATCH | Swollen water canal near Kullu bus stand following heavy rainfall in Himachal Pradesh pic.twitter.com/aMa2lr3MNJ
— ANI (@ANI) July 9, 2023
#WATCH | Himachal Pradesh: Heavy rainfall in Kullu cause landslides, vehicular movement stopped in various parts. pic.twitter.com/b1EGs6QRYc
— ANI (@ANI) July 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

