Rahul Gandhi | గుల్మార్గ్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న రాహుల్.. మంచుపై స్కీయింగ్ చేస్తూ..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో సేదతీరుతున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో సేదతీరుతున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్ వెళ్లిన రాహుల్.. మంచుపై స్కీయింగ్ చేస్తూ అక్కడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వ్యాలీలో జరిగే ప్రైవేట్ ఫంక్షన్‌కోసం రాహుల్ అక్కడికి వెళ్లారని పార్టీకి చెందిన పలువురు నేతలు తెలిపారు.

కాగా, రాహుల్ గాంధీ ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం గుండా సుమారు 4వేలకు పైగా కిలోమీటర్లు నడిచారు. గత సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర.. 75 జిల్లాల్లో 4,080 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఈ యాత్ర 135 రోజుల పాటు కొనసాగి.. గత నెల 29న కశ్మీర్లో యాత్ర ముగిసింది.
As a reward, Rahul Ji treating himself to a perfect vacation in Gulmarg after successful #BharatJodoYatra.#RahulGandhi@RahulGandhi pic.twitter.com/DDHCDluwCC
— Farhat Naik (@Farhat_naik_) February 15, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

