MI vs KKR | చేజింగ్‌లో తేలిపోయిన ముంబై.. కోల్‌కతా ఘన విజయం
MI vs KKR | బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన ముంబై.. చేజింగ్‌లో తేలిపోయింది. 170 పరుగుల టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 145 పరుగుల వద్దే ముంబై ఆలౌటయ్యింది. దీంతో 24 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
MI vs KKR | బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన ముంబై.. చేజింగ్‌లో తేలిపోయింది. 170 పరుగుల టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 145 పరుగుల వద్దే ముంబై ఆలౌటయ్యింది. దీంతో 24 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ (56) మినహా మిగతా బ్యాటర్లు అంతా చేతులెత్తేశారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒకానొక టైమ్‌లో ముంబై టార్గెట్‌ను చేధిస్తుందేమో అని అనిపించినప్పటికీ కోల్‌కతా బౌలర్లు ధీటైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి ముంబైని కష్టాల్లోకి నెట్టారు. ఒక్క 19వ ఓవర్లోనే మూడు వికెట్లు తీసి.. ముంబైని ఆలౌట్ చేశారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను ముంబై ఆరంభం నుంచే ఎక్కడికక్కడ కట్టడి చేసింది. దీంతో పవర్ ప్లే ముగిసేలోపే కోల్‌కతా నాలుగు వికెట్లను కోల్పోయింది. తుషారా వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) తిలక్‌వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లో రెండో బంతికి రఘువంశీ (13) కూడా క్యాచ్ ఔటవ్వగా.. చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ (6) కూడా ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి నరైన్ (8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్లో ఐదో వికెట్‌ను కూడా కోల్పోయింది. తొలి బంతికే రింకు (9) పీయూష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
టాపార్డర్ విఫలమై కోల్‌కతా కష్టాల్లో కూరుకుపోతున్న టైమ్‌లో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) విజృంభించారు. వీళ్లిద్దరూ కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్‌ను అందించారు. కానీ హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మనీశ్ పాండే క్యాచ్ ఔటయ్యాడు. అప్పట్నుంచి కోల్‌కతాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా వరుస వికెట్లను చేజార్చుకుంది. వచ్చీరాగానే సిక్స్‌తో బోణీ కొట్టిన ఆండ్రూ రస్సెల్ (7) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఈ ఓవర్లో కోల్‌కతా రెండు వికెట్లను కోల్పోయింది. బుమ్రా వేసిన 18వ ఓవర్లోనూ రెండు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్లో నాలుగో బంతికి రమణ్‌దీప్ (2) క్యాచ్ ఔటవ్వగా.. స్టార్క్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 19.5 ఓవర్ల వద్ద వెంకటేశ్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేలోపే 169 పరుగుల వద్ద కోల్‌కతా ఆలౌట్ అయిపోయింది.
అనంతరం లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లకు కోల్‌కతా బౌలర్లు వరుసగా షాకులు ఇచ్చారు. దీంతో రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ (13) దూకుడుగా ఆడుతూ ఔటయ్యాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో తొలి బంతికే నమన్ (11) బౌల్డ్ అయ్యాడు. ఆరో ఓవర్లో రోహిత్ శర్మ (11 ) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి ముంబై 46 పరుగులు మాత్రమే చేసింది. వరుస వికెట్లు పడుతుండటంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ (4) ఆచితూచి ఆడారు. అయినప్పటికీ 9వ ఓవర్లో నాలుగో బంతికి నరైన్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ ఔటయ్యాడు.
ఆ తర్వాత స్వల్ప తేడాలోనే వరుసగా రెండు వికెట్లను ముంబై చేజార్చుకుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా (6) ఔటవ్వగా.. 12వ ఓవర్లో రెండో బంతికి హార్దిక్ పాండ్యా (1) కూడా ఔటయ్యాడు. నిలకడగా ఆడుతూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కానీ 16వ ఓవర్లో రస్సెల్ వేసిన మూడో బంతికి ఫిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత రాణిస్తున్నాడని అనుకున్న టిమ్ డేవిడ్ (24 ) కూడా ఔటయ్యాడు.
టిమ్ ఔటయ్యాక మ్యాచ్ మొత్తం కోల్‌కతా చేతిలోకి వెళ్లిపోయింది. ఒక్క 19వ ఓవర్లోనే మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. రెండో బంతికి టిమ్ డేవిడ్‌ను, మూడో బంతికి చావ్లాను, ఐదో బంతికి కొయిట్జీ వికెట్లు తీసి ముంబైని ఆలౌట్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

