Baglihar Dam : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కు చీనాబ్ నది (Chenab river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో రాంబన్ జిల్లా (Rambal district) లోని బాగ్లీహార్ డ్యామ్ (Baglihar Dam) సామర్థ్యానికి మించి నిండిపోయింది. నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ముందు జాగ్రత్తగా డ్యామ్ గేట్లన్నీ ఎత్తారు. దాంతో చీనాబ్ నది పరవళ్లు తొక్కుతూ, నురగలు కక్కుతూ దిగువకు పరుగులు పెడుతోంది. అక్కడికి వెళ్లిన పర్యాటకులకు ఆ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలు మీరు కూడా చూడండి.
#WATCH | Ramban, J&K | Gates of Baglihar Dam have been opened as water levels in the Chenab river rise following heavy rainfall in the region. pic.twitter.com/2pG9BHHuTm
— ANI (@ANI) August 31, 2025