Flight : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇండోర్ (Idore) కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (Air India flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానం కుడి ఇంజిన్‌లో మంటలు రేగినట్లు సూచన అందుకున్న పైలట్ (Pilot).. ఆ విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఢిల్లీకి తిరిగొచ్చిన విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశామని అధికారులు చెప్పారు.
ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో ఇండోర్‌కు తరలించామని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఆగస్టు 31న ఢిల్లీ నుంచి ఇండోర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగొచ్చింది. కాక్‌పిట్ సిబ్బందికి ఇంజిన్‌లో మంటలు వస్తున్నట్లు సూచన అందింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి, కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపేయాలని నిర్ణయించుకుని ఢిల్లీకి తిరిగొచ్చారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రాధాన్యతని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.