పట్నా: బీహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లాలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. బుర్హి గండక్ నదిలో (సిక్రాన్హా నదిలో) ప్రవాహం ఉధృతమైంది. ఈ కారణంగా ఈస్ట్ చంపారన్ జిల్లా కేంద్రమైన మోతిహరిలోని భవానీపూర్ ఏరియాలో ఓ ఇంటి కింద నేల కోతకు గురై.. ఆ ఇల్లు పేక మేడలా నదిలోకి కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇల్లు నది నీళ్లలో కూలుతున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.