Captain Vijayakanth | విజయకాంత్‌ను కడసారి చూసేందుకు తరలివచ్చిన భారీ జనసందోహం.. Video
Captain Vijayakanth | శ్వాససంబంధ అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులేగాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల తండోపతండాలుగా తరలివస్తున్నారు.
చెన్నై: శ్వాససంబంధ అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులేగాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ పార్థివదేహాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు ఏరియాలోగల (DMDK) డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఉంచడంతో అక్కడ భారీ జనసందోహం నెలకొంది.
డీఎండీకే పార్టీ కార్యాలయం లోపల, బయట, రోడ్లపైన, ఫ్లైవోవర్ల మీద జనం కిక్కిరిసిపోయారు. ఈ జనసందోహాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించిన దృశ్యాలను మీరు ఈ కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Chennai: A large number of people gathered to pay the last tributes to DMDK chief Captain Vijayakanth, who passed away earlier today.
(Drone visuals) pic.twitter.com/53rJJNo4vV
— ANI (@ANI) December 28, 2023
కాగా, శ్వాస సంబంధ సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరిన విజయకాంత్‌కు వైద్య పరీక్షల్లో కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఇవాళ మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

