Kozhikode | కోజికోడ్: కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కొనసాగుతున్నది. తాజా సంఘటనలో బాధితుల కథనం ప్రకారం, నాలుగేళ్ల బాలికకు ఓ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. చిన్న శస్త్ర చికిత్స చేసి, ఆరో వేలును తొలగించవచ్చునని వైద్యులు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించారు.
బాలికకు బుధవారం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చిన పాప నోటికి ప్లాస్టర్ ఉండటంతో కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. అంతలోనే డాక్టర్ వచ్చి, పొరపాటు జరిగిందని, క్షమించాలని కోరారు. ఆమెకు గల ఆరో వేలును తొలగిస్తానని చెప్పి ఆ బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.