చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ఆరోగ్య వివరాల వెల్లడి తప్పనిసరి: అధికారులు
- యాత్రలో ఇప్పటివరకు 11 మంది యాత్రికుల మృతి
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని కోరింది. ఈ వివరాలను సీనియర్ పోలీసు అధికారి అర్పణ్ యదువంశి ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ రాటూరి మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ చేయించుకోని భక్తులను యాత్రకు అనుమతించబోమని, ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని చెప్పారు. యాత్ర మార్గాల్లో పోలీసులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తారన్నారు.
రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాల ప్రవేశానికి అనుమతి లేదని వివరించారు. ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్ అప్లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గర్వాల్ కమిషన్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ, చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు తమ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను పారదర్శకంగా తెలియజేయాలని చెప్పారు. సమగ్రమైన ఆరోగ్య పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ నాలుగు దేవాలయాలు అత్యధిక ఎత్తులో ఉన్నాయని, వేడి వాతావరణం గల ప్రాంతాల నుంచి వచ్చేవారికి సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ఈ యాత్రలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

