హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. 24వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.