Nithish Reddy | హైదరాబాద్: ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఆడుతూ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న వైజాగ్ కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (ఏపీపీఎల్) వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు.
వేలంలో నితీశ్‌ను ‘మర్లిన్ గోదావరి టైటాన్స్’ ఫ్రాంచైజీ రూ.15.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 20 లక్షల ధరతో నితీశ్‌ను తీసుకున్న విషయం విదితమే.