బెంగళూరు: తన అన్న, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేష్ (DK Suresh) తెలిపారు. విధి రాసిపెట్టి ఉంటే ఆ అత్యున్నత పదవిని అధిష్టిస్తారని అన్నారు. అయితే తర్వలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. బుధవారం డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్‌లో కర్ణాటకలో అధికార మార్పిడి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్చల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘దాని (నవంబర్ విప్లవం) గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. నాకు నవంబర్ అంటే ‘కన్నడ రాజ్యోత్సవం’ (రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం), కన్నడిగుల పండుగ జరుపుకోవడం. దాని (నవంబర్ విప్లవం) గురించి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఏఐసీసీ నాయకులను మీరు అడగాలి’ అని అన్నారు.
కాగా, తన అన్న డీకే శివకుమార్‌కు సీఎం అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు డీకే సురేష్ సూటిగా సమాధానమిచ్చారు. ‘అది (సీఎం పదవి) ఆయన విధిలో ఉంటే అది జరుగుతుంది. లేకపోతే లేదు. దాని గురించి ఎందుకు ఆందోళన చెందాలి? నా సోదరుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక నాకు ఉందని నేను చెప్పా. ఒకవేళ అది ఆయన విధిలో ఉంటే, అది జరుగుతుంది’ అని అన్నారు. అయితే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
Also Read:
DK Shivakumar | కారు లేని అబ్బాయిలతో అమ్మాయిలకు పెళ్లి చేయరు: డీకే శివకుమార్
Watch: ఆసక్తి రేపుతున్న డ్రైవర్‌లెస్ కారు.. వీడియో వైరల్