e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News ధోలావీరాలో మోదీ.. పాత ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని

ధోలావీరాలో మోదీ.. పాత ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని

ధోలావీరా: ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో గుజ‌రాత్‌లోని ధోల‌వీరా చేరిన విష‌యం తెలిసిందే. తాజాగా యునెస్కో ప్ర‌క‌టించిన జాబితాలో ఆ ప్రాచీన న‌గ‌రాన్ని చేర్చారు. అయితే ప్ర‌ధాని మోదీ గ‌తంలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు. ర‌ణ్ ఆఫ్ క‌చ్‌లో ఉన్న ధోలావీరాను ఆయ‌న ప‌రిశీలించారు. ఆ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఇప్పుడు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో మొద‌టిసారి ధోలావీరా విజిట్ చేశాన‌ని, ఆ ప్రాంతాన్ని చూసి ఎంతో త‌న్మ‌య‌త్వానికి లోనైట్లు మోదీ తెలిపారు. ఆ త‌ర్వాత గుజ‌రాత్ సీఎంగా మ‌ళ్లీ ధోలావీరాను విజిట్ చేసిన‌ట్లు మోదీ తెలిపారు. ధోలావీరాలో ఉన్న ప్రాచీన సంప‌ద‌ను సంర‌క్షించే బాధ్య‌త‌ల‌ను గ‌తంలో చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న చెప్పారు. టూరిజం ఫ్రెండ్లీ స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు త‌మ బృందం ప‌నిచేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana