మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 14:54:09

దేశంలో రిక‌వ‌రీ రేటు 63 శాతం : కేంద్ర మంత్రి

దేశంలో రిక‌వ‌రీ రేటు 63 శాతం :  కేంద్ర మంత్రి

హైద‌రాబాద్‌: దేశంలో కోవిడ్‌19 పేషెంట్ల‌లో రిక‌వ‌రీ రేటు 63 శాతం ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.  దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణాల రేటు 2.72 శాతంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ప‌ట్ల ఆందోళ‌న లేద‌ని,  ఎక్కువ స్థాయిలో కేసుల‌ను డిటెక్ట్ చేసేందుకు టెస్టింగ్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా 2.7 ల‌క్ష‌ల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌డుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. జ‌నాభా ఎక్కువ ఉన్న దేశం మ‌న‌ది అని, అయినా కానీ కోవిడ్‌19 స‌మూహ వ్యాప్తి లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కొన్ని కొన్ని చోట్ల స్వ‌ల్ప స్థాయిలో వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. 


logo