చండీగఢ్: ఓ మహిళ డ్రగ్స్ మత్తులో తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై ఆమె నడవలేని స్థితిలో కనిపించింది. ఆప్ ఎమ్మెల్యే జీవన్ జ్యోత్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్సర్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని మక్బూల్‌పురా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో మాదకద్రవ్యాలకు బానిసలుగా ఈ ప్రాంతం పేరుగాంచింది. మహిళ డ్రగ్స్ ప్రభావంతో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల హామీని ఆప్ నెరవేర్చలేదని, డ్రగ్స్ మాఫియా కొనసాగుతున్నదని, దీనికి ఇదే నిదర్శమని విమర్శించాయి.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై మక్బూల్‌పురా పోలీసులు స్పందించారు. మహిళ డ్రగ్స్ మత్తులో కనిపించిన ప్రాంతంలో ఆదివారం తనిఖీలు చేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో పాతది కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ వీడియోను మొదట పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Arvind Kejriwal (Super CM) & Bhagwant Mann (titular CM) had promised to make Punjab “nasha mukt” in 1 week.
Due to drug overdose this girl is unable to stand on her feet properly in Maqboolpura,Punjab
From Delhi to Punjab-Kejriwal & AAP allowed Nasha & Sharab to flourish pic.twitter.com/JOq3hU3uN0
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 12, 2022