బోనకల్లు, నవంబర్ 10 : బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో T-SAT, TS GHMA ఆధ్వర్యంలో మండల స్థాయిలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎంఈఓ దామాల పుల్లయ్య సోమవారం బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జిహెచ్ఎంఏ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొనకండ్ల భాగ్యలక్ష్మి, దాసరి సునీల్ కుమార్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.