రాజాపేట, నవంబర్ 10 : రాజాపేట మండలంలోని బూరుగుపల్లికి చెందిన బుర్రకథ కళాకారుడు చింతల రామలింగం (106) కన్నుమూశారు. ఆయన గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. రామలింగంకు ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామలింగం ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం ఊరూరా బుర్రకథలు చెప్పి కుటుంబాన్ని పోషించాడు.