బెంగళూరు, మార్చి 16: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వీఐపీల ప్రత్యేక వైమానిక ప్రయాణ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. రెండేళ్లకు 34 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయినట్టు పబ్లిక్ వర్క్స్ శాఖ వెల్లడించింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఖర్చులపై వివరణ ఇచ్చారు. 2023-24లో అత్యున్నతస్థాయి అధికారులు, నేతల విమాన ప్రయాణాలకు ప్రభుత్వం 13.38 కోట్లను ఖర్చు చేసిందని, 2024-25 ఏడాదికి అది రూ.21.20 కోట్లకు పెరిగి, రెండేండ్లకు రూ.34.58 కోట్లకు చేరినట్టు వివరించారు. వీరిలో అత్యధిక హెలికాప్టర్ ట్రిప్పులతో సిద్ధరామయ్య మొదటి స్థానంలో ఉన్నారు.