Vinesh Phogat | స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) ఇవాళ నామినేషన్ (nomination) దాఖలు చేశారు. వచ్చే నెలలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly elections) వినేశ్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజకవర్గం (Julana Assembly Constituency) నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జులానా స్థానానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, ఇతర నేతలు ఉన్నారు.
కాగా, ఐదు రోజుల క్రితం బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో వినేశ్‌కు వ్యతిరేకంగా.. బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీపడనున్నారు. వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Jind: Congress candidate from Julana Assembly Constituency Vinesh Phogat files her nomination for the upcoming Haryana Assembly elections in the presence of Congress MP Deepender S Hooda pic.twitter.com/ahrjtGbdgt
— ANI (@ANI) September 11, 2024
Also Read..
Harish Rao | పసికందును పీక్కుతిన్న కుక్కలు.. మనసు కలిచివేసిందన్న హరీశ్‌రావు
Mahbubnagar | దొంగతనానికి వచ్చి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి
Haider Raza: 2.5 కోట్లు ఖరీదు చేసే హైదర్ రాజా పెయింటింగ్ చోరీ