ముంబై: సయ్యిద్ హైదర్ రాజా(Haider Raza) వేసిన 2.5 కోట్ల ఖరీదైన పెయింటింగ్‌ను ముంబైలోని వేర్‌హౌజ్ నుంచి అపహరించారు. ఎంఆర్ఏ మార్గ్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ముంబైలోని గురు ఆక్షన్ హౌజ్ వేర్‌హౌజ్ నుంచి దొంగలించారు. ప్రకృతి పేరుతో హైదర్ రాజా ఆ పెయింటింగ్ వేశారు. 1992లో దాన్ని వేసినట్లు తెలుస్తోంది. ఆ కళాకృతిని రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
సీసీటీవీ ఫూటేజ్ ద్వారా ఆ నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రకరకాల రంగు పెయింట్లతో వేసిన ఆ ఆర్ట్‌వర్క్‌కు చెందిన పెయింటింగ్‌ను కరోనా సమయంలో వేర్‌హౌజ్‌లో పెట్టారు. హైదర్ రాజా ఫ్రాన్స్‌లో తన కెరీర్‌ను కొనసాగించారు. 94 ఏళ్ల వయసులో 2016లో ఆయన తుదిశ్వాస విడిచారు.