పాట్నా: క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒక కుంటుంబంలోని ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టిచంపారు. ఆ తర్వాత వారిని దహనం చేశారు. (villagers kill, burn 5 of family) ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టెట్గామా గ్రామంలో ఇటీవల కొందరు వ్యక్తులు మరణించారు. పలువురు అనారోగ్యం బారినపడ్డారు.
కాగా, ఒక కుటుంబం క్షుద్రపూజల వల్ల వారు చనిపోయినట్లు గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా కొట్టి చంపారు. బాబులాల్ ఒరాన్, సీతా దేవి, మంజీత్ ఒరాన్, రానియా దేవి, తప్టో మోస్మత్కు నిప్పుపెట్టి దహనం చేశారు.
మరోవైపు ఆ కుటుంబం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆ గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు పారిపోయారు. సమీపంలోని చెరువు నుంచి కాలిన నాలుగు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్
Himachal floods | కొట్టుకుపోయిన తల్లిదండ్రులు, అమ్మమ్మ.. ప్రాణాలతో బయటపడిన 11 నెలల పసి పాప