చెన్నై: తమిళనాడు నటుడు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు గుర్తింపు లేదని ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. (Vijay’s party not recognised) కరూర్ ర్యాలీ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా టీవీకే అర్హత సాధించేందుకు అవసరమైన ప్రమాణాలను అందుకోలేదని ఈసీ తరుఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టుకు వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే పోలైన చెల్లుబాటు ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, అసెంబ్లీలో రెండు సీట్లు లేదా లోక్‌సభలో ఒక సీటు సాధించడం వంటి ఈసీ నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవాలని వివరించారు.
కాగా, సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరుగడంతో 41 మంది మరణించారు. మధురై బెంచ్ న్యాయవాది దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. టీవీకే పార్టీ రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపును రద్దు చేయాలని నటుడు విజయ్‌పై అదనపు అభియోగాలను ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేదని ఈసీ తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
Also Read:
Mamata Banerjee | సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ
Sisters Marry Multiple Men | పలువురిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్
Watch: రైతుల వెంటపడిన పులి.. భయంతో చెట్లు ఎక్కిన కొందరు