Vijay Rupani : ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) అంత్యక్రియలు సోమవారం జరిగాయి. రాజ్‌కోట్‌లో ఆయన పార్థీవ దేహానికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. రూపానీ అంత్యక్రియల సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినం (State Mourning) పాటించింది సర్కార్. సాయంత్రం 5 గంటలకు రూపానీ ఇంటి నుంచి అంతియ యాత్ర మొదలైంది.
అనంతరం శ్మశానం దగ్గర పోలీసులు 21 పర్యాయాలు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు వీడ్కోలు పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ అచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌లు రూపానీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.
Vijay Rupani : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને દુર્ઘટનાનો શિકાર બન્યા. આજે રાજકોટ ખાતે તેમની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઇ. તેમની અંતિમ યાત્રા મોટી… pic.twitter.com/dt4UaL2r53
— Gujarat Samachar (@gujratsamachar) June 16, 2025
జూన్ 12న జరిగిన ఎయిరిండియా బోయింగ్ ఏ1 171 డ్రీమ్ లైనర్ ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూసిన విషయం తెలిసిందే. లండన్‌లోని భార్య, కూతురును చూసేందుకు వెళుతున్న ఆయన ఈ ఘటనలో దుర్మరణం చెందారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు.
ప్రమాద స్థలి నుంచి మృత దేహాల్ని సేకరించిన ఫోరెన్సిక్ బృందం ఆదివారం డీఎన్ఏ పరీక్షలు జరిపింది. రూపానీ డీఎన్ఏ మ్యాచ్ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మరో 86 మందిని కూడా గుర్తించినట్టు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. బీజేపీకి చెందిన విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.