పాలమూరు : రైతు క్షేమమే ( Farmers welfare ) ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మహబూబ్ నగర్ నియోజకవర్గం ధర్మాపూర్ రైతు వేదిక వద్ద ధర్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చమ్మ, కృష్ణయ్య, గోవర్ధన్‌కు రైతు బీమా చెక్కులను జిల్లా కలెక్టర్‌తో కలిసి అందజేశారు.
అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి, రైతులను రుణ విముక్తి చేశామని గుర్తు చేశారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజు గౌడ్, ఎన్ బాలయ్య, శ్రీనివాస్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఖాజా, ఎంపీడీవో కరుణశ్రీ , వ్యవసాయ అధికారులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.