Iran – Israel Conflict : ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరుదేశాలు పరస్పర దాడులతో జనం భయకంపితులవుతున్నారు. సోమవారం ఇజ్రాయేల్ (Israel) దాయాదిపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోని ఇరాన్‌లోని స్టేట్ స్టూడియో లక్ష్యంగా క్షిపణితో దాడి జరిగింది. ఆ సమయానికి అక్కడ వార్తలు చదువుతున్న యాంకర్ మీద శకలాలు వచ్చి పడ్డాయి. దాంతో, ప్రాణ భయంతో ఆ యాంకర్ సురక్షిత ప్రదేశానికి పరుగులు తీసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియలో వైరలవుతోంది.
సోమవారం ఇరాన్ వ్యాప్తంగా పలు చోట్ల ఇజ్రాయేల్ సైన్యం మిస్సైల్ దాడులను తీవ్రం చేసింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ (Tehran) గగనతలం మీదుగా వందలాది క్షిపణులను ప్రయోగించింది. అదే సమయంలో స్టేట్ టీవీ స్టూడియోలో సహర్ ఇమామీ (Sahar Imami) అనే యాంకర్ లైవ్ న్యూస్ చదువుతోంది. అయితే.. క్షిపణి దాడిలో భవనంలోని చాలా భాగం ధ్వంసం అయింది. సహరపై కొన్ని శకలాలు పడ్డాయి. దాంతో, కంగారు పడిన ఆమె అక్కడి నుంచి వెంటనే లేచి ప్రాణాలు కాపాడుకుంది. కాసేపటికే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
Israeli military struck the Iranian state TV studio while they were LIVE ON AIR.
Abdul living in Seelampur Jhuggi is crying after watching the visuals. pic.twitter.com/wT3ERgXF0A
— Incognito (@Incognito_qfs) June 16, 2025
ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అయితే ఇరాన్ తన ప్రతిదాడిలో భాగంగా ఇప్పటి వరకు 370 బాలిస్టిక్ క్షిపణుల(Ballistic Missiles)ను ప్రయోగించింది. దీంతో పాటు వందలాది సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయిల్ మీదకు వదినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ద్రువీకరించింది