మునిపల్లి : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ( Budera) గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు. బుదేరా చౌరస్తాలో రేకుల షెడ్డు నిర్మాణంతో పాటు కరెంటు మీటర్ కోసం పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ( Secretary Nagalaxmi ) ని సంప్రదించాడు.
వాటి అనుమతికి రూ. 12 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ( ACB ) ఆశ్రయించాడు. మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ , సిబ్బంది సోమవారం పక్కా వ్యూహం ప్రకారం బాధితుడి వద్ద నుంచి కార్యదర్శి రూ.8 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆమె కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.