Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటూ సాగే ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకూ 57 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, అక్కడ సంగమంలో స్నానాలు చేస్తున్న మహిళా భక్తులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసి కొందరు సోషల్ మీడియాలో విక్రయిస్తున్న ఉదంతం బయటకు వచ్చింది. దీనిపై యూపీ పోలీసులు (UP Police) చర్యలకు ఉపక్రమించారు.
ఈ ఘటనపై ఇప్పటి వరకూ కోత్వాల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోలు, ఫొటోలు పోస్టు అయినట్లు గుర్తించారు. ఆ ఇన్స్టా ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా మెటా (Meta) సంస్థ నుంచి వివరాలు కోరినట్లు వెల్లడించారు. అంతేకాదు టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11లో కూడా ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Doctor | విషాదాంతమైన విహారయాత్ర.. ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు
Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం.. నాలుగో మహిళా సీఎంగా రికార్డు