Doctor | విషాదాంతమైన విహారయాత్ర.. ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు
Doctor | విహారయాత్ర విషాదాంతమైంది. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా టూర్‌కు వెళ్లిన ఓ యువ వైద్యురాలు (Hyderabad doctor) ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
Doctor | విహారయాత్ర విషాదాంతమైంది. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా టూర్‌కు వెళ్లిన ఓ యువ వైద్యురాలు (Hyderabad doctor) ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో ( Koppal dist) చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్య మోహన్ రావు (27) తన ఫ్రెండ్స్‌తో కలిసి కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ అంతా సుందరమైన ప్రదేశాలను సందర్శించారు. మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం వారంతా తుంగభద్ర నది (Tungabhadra river) వద్దకు వెళ్లారు. అక్కడ ఈత (swim) కొట్టేందుకు అనన్యరావు నదిలోకి దిగింది. 25 అడుగుల ఎత్తైన బండరాయి నుంచి అనన్యరావు నీటిలోకి దూకి ఈత కొట్టేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ఈత కొడుతూ నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న ఆమె స్నేహితులు అనన్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. వెంటనే వారు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంతో యువతి కోసం నదిలో సాయంత్రం వరకూ తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయినా ఆమె జాడ కానరాలేదు. తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలు అని తెలిసింది. ఆమె నదిలోకి దూకుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#KoppalMishap #Sanapur
Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025
Also Read..
Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం.. నాలుగో మహిళా సీఎంగా రికార్డు
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

