న్యూఢిల్లీ: ఈ ఫోటో చూశారా? ఈయనే విజేందర్ గుప్తా(). పదేళ్ల క్రితం ఈ బీజేపీ నేతను.. అసెంబ్లీ నుంచి లాక్కెళ్లి.. ఎత్తుకెళ్లి.. మార్షల్ ఆయన్ను బయటపడేశారు. 2015, నవంబర్ 30న ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అల్కా లంబాపై బీజేపీ నేత ఓపీ శర్మ ఓ కామెంట్ చేశారు. దాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో రగడ జరిగింది. ఆ సమయంలో విజేందర్ గుప్తా .. సభలో ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెల్ల కుర్తా వేసుకుని ఆందోళన చేస్తున్న విజేందర్ గుప్తాను.. అసెంబ్లీ నుంచి మార్షల్ ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్‌ను పట్టుకుని ఉన్నా.. ఆయన్ను అరడజను మంది గుంజుకెళ్లారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎంగా ఇవాళ రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు విజేందర్ గుప్తా స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. రోహిణి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. 2015 నుంచి ఆయన అదే స్థానంలో ఉన్నారు. పార్టీ తనకు స్పీకర్ బాధ్యతను అప్పగించినందుకు థ్యాంక్స్ చెప్పారు. తన బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు. సభలో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆమ్ ఆద్మీకి చెందిన 14 కాగ్ రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీయనున్నట్లు ఇటీవల విజేందర్ గుప్తా పేర్కొన్నారు. తప్పుడు వాగ్ధానాలతో ఢిల్లీ ప్రజల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా మోసం చేసిందో బహిర్గతం చేయనున్నట్లు ఆయన చెప్పారు. వాస్తవానికి విజేందర్ గుప్తా.. సీఎం పోస్టుకు షార్ట్‌లిస్టులో ఉన్నట్లు ఆరంభంలో ఊహాగానాలు వినిపించాయి. కానీ సీఎం పోస్టు రేఖా గుప్తాను వరించింది.
VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”
(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT
— Press Trust of India (@PTI_News) February 20, 2025