Suicide | భారత్‌లో 30 శాతానికి తగ్గిన ఆత్మహత్య మరణాల రేటు.. వరల్డ్‌వైడ్‌గా ప్రతి 43 సెకన్లకు ఒకరు సూసైడ్
Suicide | మన దేశంలో (India) ఆత్మహత్యల మరణాల రేటు (Suicide Death Rates) 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lancet Public Health) అధ్యయనం తాజాగా వెల్లడించింది.
Suicide | మన దేశంలో (India) ఆత్మహత్యల మరణాల రేటు (Suicide Death Rates) 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lancet Public Health) అధ్యయనం తాజాగా వెల్లడించింది. ఆత్మహత్య మరణాల రేటు 1990లో లక్ష జనాభాకు 18.9గా ఉండేదని పేర్కొంది. అయితే 2019లో అది లక్ష జనాభాకు 13.1 శాతానికి, 2021లో లక్ష జనాభాకు 13 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. 1990 నుంచి 2021 వరకూ భారత్‌లో ఆత్మహత్యల మరణాల రేటు 31.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.
లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. ఆత్మహత్యల ద్వారా మరణాల రేటు తగ్గడం మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపించింది. 1990లో స్త్రీలలో ఆత్మహత్య మరణాల రేటు లక్ష జనాభాకు 16·8 శాతంగా ఉండగా.. అది 2021లో లక్ష జనాభాకు 10·3 శాతానికి తగ్గింది. ఇక 1990లో పురుషుల ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకు 20.9 శాతంగా ఉంది. 2021 నాటికి అది లక్ష జనాభాకు 15.7కు తగ్గింది. ‘2020లో భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యల మరణాల రేటు విద్యావంతులైన మహిళల్లోనే కనిపించింది. ఇందుకు కారణం కుటుంబ సమస్యలే’ అని యూఎస్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) పరిశోధకులు తెలిపారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 740,000 ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. అంటే సగటున ప్రతి 43 సెకన్లకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారన్నమాట. గత మూడు దశాబ్దాల్లో వయస్సు- ప్రామాణిక మరణాల రేటు దాదాపు 40 శాతానికి తగ్గింది. లక్ష జనాభాకు 15 మరణాల నుంచి లక్ష జనాభాకు 9 మరణాలకు చేరింది. ఇందులో ఆడవారిలో మరణాల రేటు 50 శాతానికి క్షీణించగా.. పురుషుల్లో 34 శాతానికి తగ్గింది. మొత్తం మీద ఆత్మహత్యల మరణాల రేటు మగవారిలో లక్ష జనాభాకు 12.8 శాతంగా, స్త్రీలలో లక్ష జనాభాకు 5.4 శాతంగా ఉంది.
Also Read..
Doctor | విషాదాంతమైన విహారయాత్ర.. ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు
Rekha Gupta: సీఎం రేఖా గుప్తా ఆస్తుల వివరాలు మీకు తెలుసా ?
Old woman | నా స్థలాన్నైనా ఇప్పించండి.. లేదంటే చనిపోవడానికైనా అనుమతివ్వండి.. వృద్ధురాలి పోరుబాట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

