Old woman | మధిర ఫిబ్రవరి 20 : ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించాలని ఓ 85 ఏండ్ల వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా సమస్య తీరకపోవడంతో.. అదే ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని నిరసన దీక్షకు దిగింది.
తన స్థలానైనా ఇప్పించండి… లేకపోతే చనిపోవటానికైనా అనుమతి ఇవ్వండి అంటూ వృద్ధురాలు దీక్షకు దిగిన సంఘటన మధిర నియోజకవర్గ కేంద్రంలోని వెలుగుచూసింది. మండలంలోని దెందుకూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కనకపుడి కరుణమ్మ మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని నిరసన దీక్షలో కూర్చుంది.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. తన ఇంటి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో అనేకసార్లు ఫిర్యాదు చేసిన సమస్యను పరిష్కరించలేదని వాపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు స్థల వివాద సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించడం వలన తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించింది.
ఈ సమస్యను అధికారులు పరిష్కరిస్తారని నమ్మకంతో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి చేసేదేమీ లేక దీక్షకు కూర్చోవడం జరిగిందని వివరించింది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తన స్థలాన్ని తనకు ఇప్పించాలని వేడుకుంటుంది.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!