Assam | ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఉదల్గురి జిల్లాలో ఆదివారం సాయంత్రం 4:41 గంటల సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజల ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ భూకంపం దాటికి నాగావ్ (Nagaon) జిల్లాలోని ఓ ఆసుపత్రి (Assam Hospital) కంపించింది. దీంతో ఆస్పత్రిలోని నవజాత శిశువులను రక్షించేందుకు నర్సులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేశారు. ప్రకంపనల సమయంలో ఆదిత్యా ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Neonatal intensive care unit)లో ఊయలలో ఉన్న శిశువులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
VIDEO | As an earthquake of 5.8 magnitude shook parts of the northeast region and West Bengal on Sunday, nurses from a hospital in Assam’s Nagaon acted heroically, ensuring the safety of newborns as tremors hit the region.
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/MOFUmU93QY
— Press Trust of India (@PTI_News) September 15, 2025
Also Read..
Delhi | న్యూఢిల్లీలో రోడ్డుప్రమాదం.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి
Supreme Court | వక్ఫ్ చట్టంపై నేడు మధ్యంతర తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..!
జీఎస్టీ 2.0తో పేదలపై మరింత భారం!