Viral Video | వెలుగుల పండుగ దీపావళి నాడు కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. తమ వాహనాలపై టపాసులు పేల్చి హంగామా సృష్టించారు. మొన్నటికి మొన్న తమిళనాడు (Tamil Nadu) తిరుచ్చి (Trichy)లో ఓ యువకుడు బైక్‌పై టపాసులు పేల్చుతూ.. ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. హర్యానా రాష్ట్రంలో కొందరు యువకులు కారు టాప్‌పై టపాసులు (Firecrackers) కాలుస్తూ బీభత్సం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
గురుగ్రామ్ సెక్టార్ 70 (Sector 70 of Gurugram) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు కార్లు రోడ్డుపై అతివేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. మూడిట్లో ఓ కారు ఫాస్ట్‌గా వెళ్తూ పైకప్పుపై బాణాసంచా కాల్చడం కనిపిస్తుంది (Bursting Crackers On Cas Roof). ఇక మరో కారులోని వ్యక్తి సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి కేకలు వేస్తూ కనిపిస్తాడు. అయితే, ఈ మూడు కార్లకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోని గ్రేటర్ నోయిడా వెస్ట్ అనే అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వీడియోకి ‘దీపావళి పేరుతో గురుగ్రామ్ యువకులు అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలోని యువత ఇప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ తీసేసి వీడియోలు చేస్తున్నారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
दिवाली पर गुरुग्राम के युवकों ने सेलिब्रेशन के नाम पर फैलाई अराजकता, NCR के युवक अब इतने चालाक हो गए हैं कि गाड़ियों की नंबर प्लेट छुपा कर वीडियो बना रहे है। pic.twitter.com/tDoLY99fHX
— Greater Noida West (@GreaterNoidaW) November 14, 2023
ఈ వీడియోపై గురుగ్రామ్ పోలీసులు కూడా స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తున్నాం. సీసీటీవీ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వివరాలు సేకరించిన తర్వాత నిబంధనల ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు తెలిపారు.
కాగా, గురుగ్రామ్‌లో గత నెల ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి కారు పైకప్పుపై టపాసులు కాల్చాడు (Firecrackers). స్థానిక సైబర్ సిటీ ప్రాంతంలో గల గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో కారు డోర్ నుంచి బయటకు వచ్చి పైకప్పుపై (Cars Roof) టపాకులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఆ సమయంలో కారుకు నంబర్ ప్లేటు లేకపోవడం గమనార్హం.
Unidentified persons booked for bursting crackers from their car: #Gurugram Police. #Viralvideo pic.twitter.com/MocAcsvlUx
— Akshara (@Akshara117) October 19, 2023
ఆ తర్వాత మొన్న తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలో ఓ యువకుడు బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేసిన వీడియో సైతం వైరల్ అయ్యింది. యువకుడు తన బైక్ ముందు ఉన్న లైట్ భాగంలో టపాసులను అమర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్ (Bike Stunt) చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నవంబర్ 9న సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసిన తిరుచ్చి పోలీసులు (Trichy Police) సదరు యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
எவனோ ஒருத்தன் ஆரம்பிச்சி வச்சான், இப்ப நிறைய பேரு இதே மாதிரி பைக்ல வெடி கட்டி வீடியோ போட ஆரம்பிச்சிட்டானுக. pic.twitter.com/cpofhXjV6W
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) November 12, 2023
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
Ind Vs Nz | ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు బెదిరింపులు.. వాంఖడే స్టేడియం వద్ద హై అలర్ట్
Namitha | చీటింగ్ కేసులో నటి నమిత భర్తకు సమన్లు