న్యూఢిల్లీ : సమాజంలో సంతోషం విరజిమ్మేలా ఫీల్ గుడ్ వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఎంతోమంది ముఖాలపై నవ్వులు పూయిస్తూ ఓ సానుకూల దృక్పధం నింపే వీడియోలూ (Viral Video) నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇక లేటెస్ట్గా అన్షిక అవస్ధి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ట్విట్టర్లో తెగ వైరలవుతోంది.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలోని వేర్‌హౌస్ కేఫ్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో నిరాశ్రయ మహిళతో అన్షిక డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఇద్దరూ మంచి ఈజ్‌తో డ్యాన్స్ చేస్తుండగా మహిళను అన్షిక హత్తుకోవడంతో ఈ క్లిప్ ముగుస్తుంది. ఢిల్లీ చాలా అందమైన నగరం..ఇక్కడ అన్ని రకాల మనుషులను కలవచ్చు..మీతో డ్యాన్స్‌తో కలిసిపోయే వారు ఇంకా మన మనసుకు దగ్గరవుతారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Delhi is beautiful. You meet all sorts of people. And, the best ones are those who randomly join you in dance. Happy Monday, everyone! 🤍#Dance #Delhi #vibes pic.twitter.com/ffOPZuyU2D
— Anshika Awasthi (@anshikawasthi) July 10, 2023
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 1.34 లక్షల మందికి పైగా వీక్షించగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఇలాంటి స్వీట్ మొమెంట్ను షేర్ చేసినందుకు అన్షికకు పలువురు థ్యాంక్స్ చెప్పారు. మేం కన్నాట్ ప్లేస్‌లోని వేర్‌హౌస్ కేఫ్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా మ్యూజిక్ హోరు వినిపిస్తోంది..కేఫ్ బయట ఇద్దరు చిన్నారులు తమ చేతిలో బెలూన్స్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. మేం వారితో డ్యాన్స్ చేస్తుండగా ఓ మహిళ మాతో డ్యాన్స్ చేయడం మొదలు పెట్టడం ఎంతో సంతోషంగా అనిపించింది అని అన్షిక రాసుకొచ్చారు.
Read More :
Bhola Shankar Movie | భోళా శంకర్ సెకండ్ సింగిల్ రిలీజ్.. చిరు డ్యాన్స్ ఇరగదీశాడుగా..!