Bhola Shankar Movie Second Single | ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బంపర్ హిట్టయిన వేదాళం సినిమాను చిరు భోళా శంకర్‌గా రీమేక్ చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి మాస్సీవ్ కంబ్యాక్ తర్వాత చిరు ఈ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పాటల కాస్త మంచి హైప్ నే తీసుకొచ్చాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్‌లలో బిజీగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఇటివలే రిలీజైన టీజర్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంది. మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే సెలబ్రేషన్ సాంగ్ ఊర్రూతలూగిస్తుంది. మహతి స్వరసాగర్ స్వర పరిచిన ఈ క్యాచీ ట్యూన్‌కు అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వోకల్స్ అదిరిపోయాయి. అంతే క్యాచీగా కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. పాట చాలా కలర్ఫుల్గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో నర్సపెల్లి అనే ప్రైవేట్ సాంగ్ బిట్ అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. ఇక ఇప్పటికే రిలీజైన భోళా మేనియా ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. సోషల్ మీడియాలోనూ ఈ పాట రీల్స్, షార్ట్స్‌ల రూపంలో ఊపేస్తుంది.
అదే విధంగా ఈ సెలబ్రేషన్ సాంగ్ కూడా ఊపేస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్గా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చుతున్నాడు.