(Venkaiah Naidu) హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్న అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. గతేడాది గుణపాఠాలను దృష్టిలో పెట్టుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాలను మన కనీస ధర్మంగా పాటించడం ద్వారా ఈ మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమని చెప్పారు. 15-18 ఏళ్ల వారంతా టీకాలు వేసుకోవాలన్నారు. టీకాలపై ప్రజల అనుమానాలను వైద్యులు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15 వ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచం నలుమూలల ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతుండటం సంతోషకరమన్నారు.
అమెరికా ఆధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. భారత్-అమెరికా సంస్థలు ఇలాగే సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో గ్రామీణ, పట్టణ / నగర ప్రాంతాల మధ్య ఉన్న వైద్యసేవల అంతరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సరైన వైద్యసేవలు అందించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ టెలి మెడిసిన్ ద్వారా కూడా గ్రామాల్లో ప్రాథమిక వైద్యసేవలను విస్తరించేందుకు చొరవతీసుకోవాలన్నారు.
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..