Vande Bharat | హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానికి ప్రధాని మోదీ వందేభారత్ రైలును ప్రారంభించడం ఇది 11వ సారి! ఇంతకుముందు ఆయనే పదిసార్లు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ప్రారంభించే ప్రతిసారి ఇదే రకంగా ప్రచారాన్ని ఊదరగొడుతున్నది బీజేపీ.