Valmik Thapar | ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏండ్లు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్న ఆయన శనివారం ఉదయం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు లోధి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
థాపర్.. తన జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేశారు. ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మీక్ థాపర్ ప్రత్యేక దృష్టి సారించారు. వాల్మీక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ వంటి దాదాపు 30కి పైగా పుస్తకాలు రచించారు. ఆయనకు ఇండియన్ టైగర్ మ్యాన్ (Indias tiger man)గా మంచి గుర్తింపు ఉంది. వాల్మీక్ థాపర్ మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు.
Also Read..
WhatsApp | మరింత ఆకర్షణీయంగా.. వాట్సాప్ స్టేటస్ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు
Mock Drills | నేడు పాక్ సరిహద్దు రాష్ర్టాల్లో మాక్ డ్రిల్స్
Covid-19 | దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. రెండు వేలు దాటిన పాజిటివ్ కేసులు