Watch: రోడ్డుపై వ్యక్తిని కొట్టిన బీజేపీ మంత్రి.. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
BJP Minister Beats Man | బీజేపీ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో, గన్మెన్ కలిసి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. వారిపై కేసు నమోదు చేశారు.
డెహ్రాడూన్: రోడ్డుపై ఉన్న వ్యక్తిని బీజేపీ మంత్రి (BJP Minister Beats Man), అతడి సిబ్బంది కలిసి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనపై జరిగిన దాడి గురించి బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బీజేపీ మంత్రితోపాటు ఆయన సిబ్బందిపై కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 2న రిషికేశ్కు చెందిన సురేంద్ర సింగ్ నేగి , తన స్నేహితుడు ధరమ్వీర్ ప్రజాపతితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఒక చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ప్రయాణిస్తున్న కారు కూడా ఆ బైక్ పక్కన ఆగింది. బైక్ వెనక కూర్చొన్న సురేంద్ర సింగ్ తన స్నేహితుడికి ఏదో చెప్పాడు.
కాగా, కారు విండో గ్లాస్ కిందకు దింపిన మంత్రి ప్రేమ్ చంద్, ఇది చూసి ఏం చెబుతున్నావని సురేంద్రను అడిగాడు. ఆయన గురించి కాదని అతడు బదులిచ్చాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి ప్రేమ్ చంద్ కారు నుంచి దిగి వచ్చి సురేంద్ర సింగ్ను కొట్టాడు. బూతులు కూడా తిట్టాడు. మంత్రి పీఆర్వో, గన్మెన్, మరి కొందరు కూడా అతడిపై దాడి చేశారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు సురేంద్ర సింగ్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు బీజేపీ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో, గన్మెన్ కలిసి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో కౌశల్, గన్మెన్ గౌరవ్, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్ కున్వర్ తెలిపారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు.
ऋषिकेश में सड़क पर कैबिनेट मंत्री प्रेमचंद अग्रवाल की एक युवक के साथ कहासुनी हो गई। बात इतनी बढ़ गई कि मंत्री सहित सुरक्षाकर्मियों ने युवक को बुरी तरह पीट दिया।#premchandaggarwal pic.twitter.com/Z7Mx15v3yZ
— Neha Bohra (@neha_suyal) May 2, 2023
Also Read:
Kedarnath Yatra: కేదార్నాథ్లో మే 8 వరకు రిజిస్ట్రేషన్లు బంద్
Watch: రియల్ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

