Watch: రియల్ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు.. వీడియో వైరల్
Property Dealer Shot | ముఖానికి ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ఒక ప్రాంతానికి చేరుకున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారిని గుర్తించి బైక్‌ను వెనక్కి తిప్పారు. అనంతరం తమ వద్ద ఉన్న గన్స్ తీసిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.
న్యూఢిల్లీ: ముగ్గురు దుండగులు ఒక రియల్ఎస్టేట్ వ్యాపారి, అతడి స్నేహితుడిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో వారిద్దరూ గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 17న గ్యాంగ్‌స్టర్ నరేష్ శెట్టి షూటర్ల బృందానికి చెందిన అక్షయ్ నుంచి ప్రాపర్టీ డీలర్ వికాస్ దహియాకు ఫోన్ కాల్ వచ్చింది. తమకు డబ్బులు ఇవ్వాలని అతడ్ని డిమాండ్ చేసి బెదిరించాడు. అయితే వికాస్ దహియా ఈ బెదిరింపును పట్టించుకోలేదు. దీంతో పది రోజుల తర్వాత ఆ గ్యాంగ్ అతడ్ని లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 27న వికాస్ దహియా, స్నేహితుడు దేవి వీర్ సింగ్ ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ముఖానికి ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ఢిల్లీలోని డిచాన్ కలాన్ ప్రాంతానికి చేరుకున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారి వికాస్ దహియాను వారు గుర్తించి బైక్‌ను వెనక్కి తిప్పారు. అనంతరం తమ వద్ద ఉన్న గన్స్ తీసిన ఇద్దరు వ్యక్తులు వికాస్ దహియా, అతడి స్నేహితుడు వీర్ సింగ్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి బైక్‌పై పారిపోయారు.
కాగా, వికాస్ దహియా, అతడి స్నేహితుడు దుండగులు కాల్పుల్లో గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నరేష్ శెట్టి గ్యాంగ్‌కు చెందిన షూటర్లు కాల్పులు జరిపినట్లు గ్రహించారు. సమీర్, ఒక మైనర్ బాలుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి బంటీ కోసం వెతుకుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం జైలులో ఉన్న నరేష్ శెట్టి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సన్నిహితుడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన బిష్ణోయ్, ఏడాది కిందట నటుడు సల్మాన్ ఖాన్‌పై కాల్పులకు ప్లాన్ చేశాడు. ఈ టాస్క్‌ను నరేష్ శెట్టికి అతడు అప్పగించగా ముంబైలోని సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించాడు. అయితే స్మలాన్ ఖాన్‌పై దాడి ప్లాన్‌ను ఆ తర్వాత రద్దు చేసుకున్నారు.
On CCTV, Property Dealer Shot At By Men On Bike After Extortion Call In Delhi https://t.co/1GLhvtRldg pic.twitter.com/0UGkYYRxAT
— NDTV (@ndtv) May 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

