Drugs Seized | గుజరాత్ తీరంలో రూ.600కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు
Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.
Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారతతీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో కలిసి అరేబియా సముద్రంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే, పాకిస్థాన్ బోటు నుంచి డ్రగ్స్ ఎలా స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని కోస్ట్‌గార్డ్ ఇంకా వివరాలు వెల్లడించలేదు.
మారిటైమ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం.. ఆపరేషన్ రాత్రిపూట నిర్వహించింది. కోస్ట్‌గార్డ్ నౌకలు, విమానాలను ఆపరేషన్ కోసం వినియోగించారు. ఎన్సీబీ, ఏటీఎస్ అధికారులు ఐసీజీ షిప్ రాజ్‌రతన్‌లో అనుమానాస్పద బోటును గుర్తించారు. నిపుణుల బృందం పాక్ బోట్లోకి దిగి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 86 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14 మంది సిబ్బందితో పాటు పాకిస్థానీ పడవను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం బోట్‌ను పోర్బంద్కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

