డెహ్రాడూన్, డిసెంబర్ 18 : ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారనున్నది. సచివాలయంలో బుధవారం ఉత్తరాఖండ్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి బోర్డు(యూఐఐడీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి ధామీ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా యూసీసీ అమలు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.