డెహ్రాడూన్: దేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వివాహాలు, విడాకులు, సహజీవనాలను నమోదు చేసుకునేందుకు రూపొందించిన యూసీసీ పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించారు.
ఉత్తరాఖండ్‌తో పాటు రాష్ట్రం బయట నివసిస్తున్న ఉత్తరాఖండ్‌వాసులకు యూసీసీ వర్తిస్తుంది. అయితే, షెడ్యూల్డ్ తెగలకు మాత్రం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూసీసీతో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, త్రిపుల్ తలాఖ్ వంటి దురాచారాలను రూపుమాపవచ్చని సీఎం పేర్కొన్నారు.