Army Uniforms | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో (Pahalgam Attack) మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఆర్మీ దుస్తుల్లో (Army Uniforms) వచ్చిన ఉగ్రమూక పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రమూక ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీ, పారామిలటరీ దుస్తుల అమ్మకాలపై నిఘా పెట్టింది. ఈ మేరకు దుకాణాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
యూనిఫాం, భద్రతా బలగాలకు సంబంధించిన వస్తువులను అమ్మే దుకాణాల జాబితాను సిద్ధం చేయాలని స్టేషన్ ఇన్‌చార్జులందరికీ డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ (Dehradun SSP Ajay Singh) ఆదేశాలు జారీ చేశారు. పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు సరైన ధృవీకరణ లేకుండా యూనిఫాంలు, ఇతర వస్తువులు విక్రయించొద్దని ఆదేశించారు. ఆర్మీ దుస్తులు, వస్తువులు అమ్మే ముందు కస్టమర్ల ఆధార్, ఐడీ కార్డులు, ఫోన్ నంబర్, అడ్రెస్ తీసుకోవాలని సూచించారు. యూనిఫాంల దుర్వినియోగం జరగకుండా ముందే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
#WATCH | Uttarakhand | In view of the Pahalgam terror attack of 22 April claiming the lives of 26 people, Dehradun SSP Ajay Singh has directed all the station in-charges to prepare a list of shops in their respective areas where uniforms and other items related to… pic.twitter.com/HGFyNtVqtj
— ANI (@ANI) April 25, 2025
Also Read..
Amit Shah | అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్.. ఉగ్రదాడి నేపథ్యంలో కీలక ఆదేశాలు
Mohan Bhagwat | ధర్మం, అధర్మం మధ్య యుద్ధం.. పెహల్గామ్ ఘటనను ఖండించిన మోహన్ భగవత్