Amit Shah | అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్.. ఉగ్రదాడి నేపథ్యంలో కీలక ఆదేశాలు
Amit Shah | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (All States CMs) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఫోన్ చేశారు.
Amit Shah | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (All States CMs) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఫోన్ చేశారు. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు.
ఇప్పటికే పాకిస్థానీల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో షా ఫోన్లో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో పాకిస్థాన్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించేయాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. వారందరి వివరాలను సేకరించారు. రెండు రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు.
పెహల్గామ్ ఉగ్ర దాడి దరిమిలా పాకిస్థాన్‌పై తీసుకున్న ప్రతీకార చర్యల కొనసాగింపుగా తక్షణమే పాకిస్థానీలకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది. పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలన్నీ ఏప్రిల్ 27 నుంచి రద్దయినట్లేనని విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్ జాతీయులకు జారీచేసిన మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా దేశంలో ఉన్న పాక్ జాతీయులందరూ భారత్‌ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్‌లోని భారతీయులందరూ త్వరగా దేశానికి రావాలని కోరింది.
Also Read..
Mohan Bhagwat | ధర్మం, అధర్మం మధ్య యుద్ధం.. పెహల్గామ్ ఘటనను ఖండించిన మోహన్ భగవత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

