Yogi Adityanath | నిందితుల్ని వదిలిపెట్టం.. అయోధ్య రామమందిరం విరాళాల స్కాంపై యూపీ సీఎం యోగి వార్నింగ్
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులు ఎలాంటివారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు.
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులు ఎలాంటివారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రామ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రజలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన కోరారు.
అలాగే, ఈ అంశంపై సిట్ దర్యాప్తు జరుపుతోందని, దీనికి సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలుంటే సిట్కు సమర్పించాలని ఆయన సూచించారు. ఆలయ ట్రస్ట్ వినతి మేరకు ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ఈ అంశంలోని విషయాల్ని సిట్ వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నామని యోగి అన్నారు. భక్తులు కూడా ఆలయంపై జరుగుతున్న అనేక దుష్ప్రచారాలను నమ్మకుండా సహనంతో ఉండాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలకు దూరంగా ఉంటూ, రాముడికి సంబంధించి గౌరవం, సహనం కలిగి ఉండాలని భక్తులను కోరారు. రామాలయ ఉద్యమాన్ని కాంగ్రెస్, ఎస్పీలు అడ్డుకుంటున్నాయని, గత ప్రభుత్వాలు రామ భక్తులకు, కర సేవకులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని యోగి గుర్తు చేశారు. గతంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఇక్కడి ఆలయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తోందని, ఇది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అన్నారు.
రామాలయ ఉద్యమాన్ని కూడా కోర్టులో కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందున్నారు. రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గతంలో కరసేవకులపై కాల్పులు జరపాలంటూ ఆదేశించిందని, జై శ్రీరామ్ అన్నవారిపై దళాల్ని ప్రయోగించిందంటూ యోగి విమర్శించారు. అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాల విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనే విషయం తాజాగా వెల్లడైంది. భక్తులు సమర్పించిన కానుకలు దేవాలయానికి చెందకుండా కొందరు సిబ్బంది కాజేశారని తేలింది. దీనిపై ప్రస్తుతం సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

