Uttam Kumar Reddy | న్యూఢిల్లీ : తాను కూడా సీఎం రేసులో ఉన్నానని, పార్టీ విధేయులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నానని హుజుర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం ఎవరనేది ఇంకా నిర్ణయం జరగలేదు. తుది నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాను. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ ఊహాగానాలు నిజం కాలేదు కదా..? హైకమాండ్ నిర్ణయం కోసం వేచి చూస్తాను. అందరి అభిప్రాయం తీసుకొని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. సీఎం ఎవరనేది ఇంకా నిర్ణయం జరగలేదు. నిజమైన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరగాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Read More: సీఎం పేరు ప్రకటనకు ముందు సంచలనం సృష్టిస్తున్న భట్టి ట్వీట్
విధేయత, ట్రాక్ రికార్డు, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించి సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నాని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియరైన ఏకైక వ్యక్తిని నేనే. నా సతీమణి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. పార్టీ మారలేదు. కొంత మిలటరీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా సీఎం అభ్యర్థిగా పరిశీలిస్తారని భావిస్తున్నాను. ఈ విషయాలన్నీ పార్టీ అధిష్టానానికి వివరించాను అని ఉత్తమ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా నన్ను కూడా కన్సిడర్ చేస్తారని నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. పోటీలో ఉన్న మమ్మల్ని కూడా కన్షిడరేషన్ చేస్తది అనుకుంటున్నాను. అల్టీమేట్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారనే విశ్వాసం ఉంది. అంచనాలు తారుమారు అయినా మా లీడర్షిప్ నిర్ణయాలను గౌరవిస్తాం. క్రమశిక్షణతో ఉంటాను. ఈ 30 ఏండ్లలో ఏ ఒక్కసారి కూడా గీత దాటలేదు అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ప్రతి ఎన్నికకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఈ ఎన్నికల్లో 72 దాకా వస్తాయనుకున్నాను. 64 వద్ద ఆగిపోవడం కొంత నిరాశ పరిచింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సంతోషకరమైన విషయం. చాలా హార్డ్ కోర్ వర్కర్‌ను. ప్రతి కార్యకర్తకు ఫోన్లో అందుబాటులో ఉంటాను. ఏ కార్యకర్త ఫోన్ చేసినా స్పందిస్తాం. తమ సామర్థ్యం ఉన్నంత వరకు సహాయం చేస్తుంటాం అని ఉత్తమ్ పేర్కొన్నారు.
Read More: సీఎం పదవి ఇచ్చినా స్వీకరిస్తా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే జీ వినోద్ కీలక వ్యాఖ్యలు