JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా తొలి రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇక నిన్న జైపూర్ వెళ్లిన ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ.. ఇవాళ ఆగ్రా (Agra) సందర్శనకు వెళ్లింది.
#WATCH | Vice President of the United States JD Vance, Second Lady Usha Vance, and their children arrive in Agra, received by Uttar Pradesh CM Yogi Adityanath pic.twitter.com/AH0eb8p40M
— ANI (@ANI) April 23, 2025
జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం యూపీలోని ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాన్స్ ఫ్యామిలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో తాజ్ మహల్ (Taj Mahal) సందర్శనకు వెళ్లారు. అక్కడ తాజ్ అందాలను వీక్షించి.. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
A warm welcome to Hon’ble US @VP Mr. @JDVance, and his family to Uttar Pradesh, the sacred heartland of India, renowned for its timeless devotion, vibrant culture, and spiritual legacy. pic.twitter.com/JDJPRB7C7M
— Yogi Adityanath (@myogiadityanath) April 23, 2025
Also Read..
“JD Vance | జైపూర్ అంబర్ ఫోర్ట్‌ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ”
“JD Vance | భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు.. వీడియో వైరల్”
“JD Vance | భారత్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ”