న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 4న 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికా జరుపుకోనున్నది.
ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఫ్రీడమ్ 250’ పోస్టర్లు ఉన్న ఆటోలను ఢిల్లీలో ఆవిష్కరించారు. (US Freedom 250) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ అమెరికా చిత్రాలతో కూడిన పోస్టర్లు ఉన్న ఆటోలు ఢిల్లీ అంతటా పరుగులు తీస్తాయని తెలిపారు. ‘ఢిల్లీ నుంచి ‘ఫ్రీడమ్250’ వేడుకలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అమెరికా 250వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అమెరికా-ఇండియా భాగస్వామ్య బలం, చైతన్యాన్ని కూడా గౌరవిస్తున్నాం. ఫ్రీడమ్250 భారతదేశం అంతటా పర్యటిస్తుంది. చూస్తూనే ఉండండి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, కొందరు నెటిజన్లు దీనిపై ఘాటుగా స్పందించారు. అమెరికా ‘ఫ్రీడమ్250’ వేడుకల కోసం భారత్‌లోని ఆటోలను ఆ దేశం ఎంచుకోవడంపై కొందరు ప్రశ్నించారు. ‘మా వద్ద ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, మెట్రోలు కూడా ఉన్నాయి. కానీ మీరు మాత్రం కేవలం ఈ కోణాన్ని మాత్రమే చూపించాలనుకుంటారు’ అని ఒకరు విమర్శించారు.
మరోవైపు పశ్చిమ దేశాలు ఎల్లప్పుడూ భారతదేశంలోని పేదరికపు కోణాన్ని (ఆటో) మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తాయి? అని మరొకరు ప్రశ్నించారు. ‘ఇది ఎల్లప్పుడూ ఆందోళన రేకెత్తిస్తుంది. మనల్ని నిజంగా సమానంగా చూస్తున్నారా?’ అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు.
అయితే భారత్‌లో అమెరికా జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? అని ఒకరు ప్రశ్నించారు. ‘ఒకవేళ భారతీయులమైన మేము మీ దేశంలో ఇలాగే చేస్తే, ఎంతమంది గొడవ చేస్తారో మీకే అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
Thrilled to kick-off the #Freedom250 celebrations from New Delhi, previewing vibrant autos featuring @POTUS and iconic American images that will be rolled out across the city to mark the start of this special journey. As we celebrate America’s 250th, we also honor the strength… pic.twitter.com/t61CptCAB7
— Ambassador Sergio Gor (@USAmbIndia) April 14, 2026
Also Read:
Arvind Kejriwal | ‘కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోలు తొలగించండి’.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం