Pull – Ups | ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు ఏకంగా హైవేపై ఏర్పాటు చేసిన సైన్బోర్డుపైకి (signboard) ఎక్కి పుల్ అప్స్ (pull-ups) తీశాడు.
అమేఠీ (Amethi)లోని జాతీయ రహదారిపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్స్ చేశాడు. నేషనల్ హైవే 931పై ఉండే సైన్‌బోర్డు పైకి ఎక్కి పుల్ అప్స్ తీశాడు. సైన్‌బోర్డు ఐరన్ రాడ్‌కు వేలాడుతూ ఈ స్టంట్స్ చేశాడు. ఏమాత్రం పట్టుజారినా పై ప్రాణాలు పైకే పోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై అమేఠీ పోలీసులు స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#अमेठी:अमेठी की सड़कों पर खतरों के खिलाड़ी,किलोमीटर के सांकेतिक बोर्ड पर पुशअप करता नजर आया युवक,जान हथेली पर डालकर सड़क से 10 मीटर ऊपर बोर्ड पर पुशअप कर रहा युवक,सचिन नाम के इंस्टाग्राम आईडी से वीडियो किया गया है पोस्ट @amethipolice @DmAmethi pic.twitter.com/Qq5kCkgcCl
— AMETHI LIVE (@AmethiliveCom) September 29, 2024
Also Read..
Hospital | ఐసీయూలో పనిచేయని ఏసీలు.. ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు..!
Actor Siddique | అత్యాచారం కేసులో సిద్ధిఖీకి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Panther Attack | మ్యాన్ ఈటర్ పాంథర్ వరుస దాడులు.. 11 రోజుల్లో ఏడుగురు మృతి